భారత ఆర్మీకి మద్దతుగా ప్రత్యేక పూజలు

బతుకమ్మ, బోధన్: కాశ్మీర్ లోని పహాల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోనీ నర్సి రోడ్డు ప్రాంగణంలో గల మారుతి మందిర ఆలయంలో భారత సైన్య రక్షణ కోసం, దేశ, ప్రజల రక్షణ కోసం విశేష పూజలు నిర్వహించడం జరిగింది. దేశం కోసం సింధూర్ ఆపరేషన్ వంటి శూరవీర కార్యాచరణలో పాల్గొంటున్న భారత ఆర్మీ జవాన్ల సాహసాన్ని అభినందిస్తూ, వారికి ధైర్యం, మనోధైర్యం కలిగించేందుకు బోధన్ పట్టణంలోని...