Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 8:15 pm Posted by : ramakrishna

భారత ఆర్మీకి మద్దతుగా ప్రత్యేక పూజలు

బతుకమ్మ, బోధన్: కాశ్మీర్ లోని పహాల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోనీ నర్సి రోడ్డు ప్రాంగణంలో గల మారుతి మందిర ఆలయంలో భారత సైన్య రక్షణ కోసం, దేశ, ప్రజల రక్షణ కోసం విశేష పూజలు నిర్వహించడం జరిగింది. దేశం కోసం సింధూర్ ఆపరేషన్ వంటి శూరవీర కార్యాచరణలో పాల్గొంటున్న భారత ఆర్మీ జవాన్ల సాహసాన్ని అభినందిస్తూ, వారికి ధైర్యం, మనోధైర్యం కలిగించేందుకు బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు జరగింది. జై భారత్ మాత నినాదాల మధ్య, దేశ రక్షణలో ఉన్న సైనికుల విజయాన్ని కోరుతూ శ్రీ ఆంజనేయ స్వామికి శాంతిపూజ, విశేషార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొని దేశానికి అంకితమైన ఆర్మీ జవాన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలో పాల్గొనడం విశేషం.