వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు

  జుక్కల్, బతుకమ్మ :   వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వర్షాధార పంటలపై ఆధారపడిన జుక్కల్ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణదేవుడి కరుణ కోసం రైతులు, గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు కలిసి గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. జుక్కల్ మండలంలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పెసర, మినుము, కంది, పత్తి, సోయాబీన్ పంటలు వర్షాభావంతో పాటు తీవ్ర ఎండలు, ఈదురుగాలుల ప్రభావానికి గురై ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో గ్రామంలో భజనలు,...