Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 2:59 pm Posted by : ramakrishna

ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ప్రధాన రహదారి ప్రక్కనగల ఈద్గా వద్ద  ముస్లిం సోదరులు సోమవారం రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జామీద్ మసీద్ ఉస్మానియా ఈద్గా కమిటీ నేతత్వంలో  ఆఫీస్ నసీరుద్దీన్ ఇమామ్ చే ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడం జరిగింది. నేల రోజుల పాటు ఉపవాస్య దీక్షలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు  ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తేలుపుకున్నారు. వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలని పార్లమెంటులో బిల్లు పెట్టాడాన్ని వ్యతిరేకిస్తూ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ముస్లిం సోదరులు చేతులకి నల్ల రిబ్బన్ కట్టుకొని వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. ఈద్గా దగ్గర కమిటీ సభ్యులు ప్రార్థనల కోసం వచ్చే ముస్లిం సోదరుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. ఈద్గా వద్ద ఏర్పాట్లకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి సందర్భంగా జామీ మజీద్ ఉస్మానియా ఈద్గా కమిటీ పెద్దలు మహ్మద్ గానమ్, ముకిమ్, బాబు ఖాన్,  అబ్దుల్ సమి, ఇలియాస్, జాకీర్ హుస్సేన్, వాహెబ్, యూనిస్ పటేల్, అస్లాం బిలాల్, అద్నాన్, అర్భాస్ ఖాన్, రాయల్, తదితర ప్రముఖులు, మత పెద్దలు, నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Special prayers at Eidgahs