చంద్రగ్రహణం సందర్భంగా చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు
బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని ప్రఖ్యాత చక్రేశ్వర శివాలయం లో ఈనెల 7న ఆదివారం జరిగే చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుండగా, గ్రహణానికి ముందు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయబడతాయని పేర్కొన్నారు. గ్రహణ సమయం ముగిసే వరకు ఆలయ ప్రాంగణం భక్తులకు అందుబాటులో ఉండదని...