Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 10:48 am Posted by : ramakrishna

భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం

తె. యూ.  వైస్ ఛాన్సల ర్ ప్రో. టి. యాదగిరిరావు

నిజామాబాద్, బతుకమ్మ: చరిత్రలో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తె. యూ.  వైస్ ఛాన్సల ర్ ప్రో. టి. యాదగిరిరావు అన్నారు.  తెలంగాణ విశ్వవిద్యాలయంలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  శుక్రవారం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సల ర్ ప్రో. టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్యఎం.యాదగిరి గారి తో కలిసి పరిపాలనా భవనం ముందు జాతీయ నాయకులకు నివాళులర్పించి జాతీయజెండా ను ఆవిష్కరించినారు. అనంతరం  తె. యూ.  వైస్ ఛాన్సల ర్ ప్రో. టి. యాదగిరిరావు ప్రసగించారు.   అహింసా మార్గంలో అనేకమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్ర సిద్ధించిందన్నారు.   దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అనేది విద్యా రంగ అభివృద్ధి మీదనే ఆధారపడుతుందని, విద్యారంగం ద్వారా సత్ప్రవర్తన, కారుణ్య భావన పౌరుల్లో స్థిరపడుతుంద న్నారు.   నూతన విద్యా విధానం విద్యారంగ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్లు సంపత్ కుమార్, ఘంటా చంద్రశేఖర్, సీహెచ్ ఆరతి, రాంబాబు గోపిశెట్టి,ఆచార్య రవీందర్ రెడ్డి, టి.సంపత్,ప్రో. కనకయ్య, డా. బాలకిషన్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ రమణాచారి, డాక్టర్ నందిని, డాక్టర్ నీలిమ, డాక్టర్ మహేందర్,సాయి గౌడ్, భాస్కర్, వినోద్, డైరెక్టర్, పి.ఆర్వో డా. ఏ. పున్నయ్య తో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ , విద్యార్థులు పరిశోధకులు పాల్గొన్నారు.

 Special place for the Indian independence movement