Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 7:09 pm Posted by : ramakrishna

ఏర్గట్ల ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి 

బతుకమ్మ, ఏర్గట్ల : మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ,ఎంపీడీవో వెంకటేశ్వర్లు,ఎంపీవో శివ చరణ్ కలిసి ఏర్గట్లలోని ఎస్సి హాస్టల్ ను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, ముచ్చటిస్తూ  ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.హాస్టల్ సిబ్బంది తో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సమకూర్చాలని, హాస్టల్ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు.  వంటగదిని పరిశీలించి, టాయిలెట్స్,హాస్టల్ పరిసరాలను శుభ్రతతో ఉండేటట్లు చూడాలని హాస్టల్ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్,హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Special Officer who inspected Ergatla SC Hostel