భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని గ్రోమోర్ ఫర్టిలైజర్ షాప్ ను మండల స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ రావు గురువారం సందర్శించారు. షాప్ లోని యూరియా, విత్తనాల నిల్వలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని స్టాఫ్ కు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ షబ్బీర్, ఏ. ఓ లావణ్య ఏ ఈ ఓ లు తదితరులు ఉన్నారు.