. . . పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరు తనిఖీ
బాల్కొండ, బతుకమ్మ :
బాల్కొండ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం బాల్కొండ మండల ప్రత్యేక అధికారి, మిషన్ భగీరథ ఈఈ, రాకేష్ ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి, మండల తహసీల్దార్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ స్పెషల్ ఆఫీసర్ తో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో మెనూ ప్రకారం వండిన మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆ తర్వాత మధ్యలో ఆగిపోయిన అదనపు తరగతి గదుల నిర్మాణం పరిశీలించి పనిని సంబంధిత కాంట్రాక్టర్ ను సంప్రదించి సత్వరమే పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.