Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 7:59 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

 

. . . బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని డీఎస్పీ విట్టల్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్‌-ఆలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా పిట్లం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో స్థానిక రాజా రాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అరైవ్‌-ఆలైవ్‌ కార్యక్రమంలో డిఎస్పీ విట్టల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ విట్టల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, డ్రైవర్ల భద్రత పోలీసుల బాధ్యత అని అన్నారు. దీర్ఘకాలం పాటు వాహనాలను నడిపే డ్రైవర్లు కంటి చూపును నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. స్పష్టమైన చూపు లేకపోవడం, విశ్రాంతి లేకుండా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రతి మూడు మాసాలకొకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించాలని అన్నారు. అతి వేగం, మద్యం మత్తు, సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ విట్టల్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై ఆంజనేయులు,నిజాంసాగర్ ఎస్సైశివకుమార్, పిట్లం హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతధికారులు ప్రజా ప్రతినిధులు డ్రైవర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.