ప్రజావాణి ఫిర్యాదులకు ప్రత్యేక చొరవ చూపాలి

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణి  ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి  73 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులనుండి వివిధ సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ తో కలిసి  జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పెండింగ్ లో...