నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
సీఎంను కోరిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గత నెల 28న కురిసిన అతివృష్టి వర్షాల వల్ల భారీగా వరద నష్టం రూరల్ నియోజకవర్గంలో జరిగిందని రైతులకు త్వరగా పంట నష్ట పరిహారం ఇవ్వాలని, 24778 మంది రైతులు జిల్లాలో వరదకు ప్రభావిత అయ్యారని తెలిపారు. 48,429 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 1026 ఎకరాల్లో ఇసుక మేట...