- సీఎంను కోరిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గత నెల 28న కురిసిన అతివృష్టి వర్షాల వల్ల భారీగా వరద నష్టం రూరల్ నియోజకవర్గంలో జరిగిందని రైతులకు త్వరగా పంట నష్ట పరిహారం ఇవ్వాలని, 24778 మంది రైతులు జిల్లాలో వరదకు ప్రభావిత అయ్యారని తెలిపారు. 48,429 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 1026 ఎకరాల్లో ఇసుక మేట వేసిందని, అలాగే వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, చెరువులు, వ్యవసాయ కరెంట్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. దీనికైయ్యే వ్యయం రూ.223 కోట్లను మంజూరు చేయాలని కామారెడ్డి కి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి కి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వినతిపత్రం అందజేశారు. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అధికారులతో 10 రోజుల్లో ఇరిగేషన్, విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ, రోడ్లు భవన శాఖల సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించి, పంట నష్టం పై ఇతర మౌళిక సదుపాయాల పునరుద్ధరిస్తామని విలేకరుల సమావేశంలో తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడడెక్కడ వరద వల్ల నష్టం జరిగిందో వరద భాదితులను ప్రభుత్వం ఆదుకుంటుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. రేకులపల్లి భూపతి రెడ్డి తెలిపారు.
