Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 8:23 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

  • కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట నష్టం, ఆస్థి నష్టం
  • జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క తో కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు వినతి

 

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేక నిధులు కేటాయించాలని కామారెడ్డి ఇంచార్జ్ మంత్రి సీతక్క తో కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శనివారం కలిసి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు నీట మునగడంతో పంట నష్టం, ఆస్థి నష్టం వాటిల్లిందని తెలిపారు. నిజం రాజులు కట్టించిన 103 సంవత్సరాల పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టులకు మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించాలన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల, మరమ్మత్తులు, పునర్నిర్మాణం, వరదల వల్ల నీట మునిగిన పంటలకు నష్ట పరిహారం, ఆస్థి నష్టానికి గానూ, నష్ట నివారణ చర్యల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు మదన్మోహన్,తోట లక్ష్మీ కాంతారావు సీఎం రేవంత్ రెడ్డి ని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ లతో నివేదికలు తెప్పించుకొని వెంటనే అవసరమైన నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు.