రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి
. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై కఠినంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్...