. . . అల్లాహ్ కరుణ కోసం ముస్లిం సోదరుల ప్రార్థనలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, చెరువులు, కుంటలు నిండిపోవాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక సలాతుల్ ఇస్తిస్కా (వర్ష ప్రార్థన) నిర్వహించారు. నమాజ్ అనంతరం అల్లాహ్‌ను వేడుకుంటూ దేశ ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని, కరువు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని హృదయపూర్వకంగా దువా చేశారు. అల్లాహ్ తన అపార కరుణతో సమృద్ధిగా వర్షాలు ప్రసాదించి రైతుల కష్టాలు తొలగించాలని, పంటలు పుష్కలంగా పండాలని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు, మత పెద్దలు, యువకులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.
