ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి స్పెషల్ డ్రైవ్
. . . జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ ఎంపీడీఓలు, హౌసింగ్ ఏ.ఈలు, ఎంపీఓలు, గ్రామ...