పట్టణంలో ప్రాపర్టీ టెక్స్, ట్రేడ్ లైసెన్స్ ల స్పెషల్ డ్రైవ్
మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్ గల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ టెక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ, రినివల్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. శనివారం పట్టణంలో వసూళ్లకు ఇంటింటికి తిరుగుతున్న స్పెషల్ టీమ్ పనితీరును కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడుండాలని, ప్రతి ఒక్క దుకాణాదారుడు ట్రేడ్ లైసెన్స్ కలిగి...