- మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్ గల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ టెక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ, రినివల్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. శనివారం పట్టణంలో వసూళ్లకు ఇంటింటికి తిరుగుతున్న స్పెషల్ టీమ్ పనితీరును కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడుండాలని, ప్రతి ఒక్క దుకాణాదారుడు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. దుకాణదారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని, రినివల్ ఉంటే రినివల్ చేయించుకోవాలన్నారు. ఐదు బృందాలకు సూపర్వైజర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఒకటో వార్డు నుంచి ఆరో వార్డు వరకు మేనేజర్ నరేందర్ సూపర్వైజర్ వ్యవహరిస్తారని, 7 నుండి 12 వ వార్డు వరకు సీనియర్ అసిస్టెంట్ ప్రతిభజ్యోతి సూపర్వైజర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ఆస్తి పన్ను ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ బృందాల వద్ద మీ ఆస్తి పన్ను ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్. ఇంచార్జ్ ఆర్ ఐ రాజేశ్వర్ వార్డ్ ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు ఉన్నారు.