జుక్కల్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సర్వే
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ, పెద్ద గుల్ల గ్రామాలతో పాటు జుక్కల్ మండల కేంద్రంలో మంగళవారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్వేను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓటరు జాబితాలో ఏవైనా మార్పులు, చేర్పులు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత...