Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 5:47 pm Posted by : ramakrishna

జుక్కల్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సర్వే

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ, పెద్ద గుల్ల గ్రామాలతో పాటు జుక్కల్ మండల కేంద్రంలో మంగళవారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్వేను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓటరు జాబితాలో ఏవైనా మార్పులు, చేర్పులు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ ప్రత్యేక సర్వేలో ఎమ్మార్వో మారుతి, డిప్యూటీ ఎమ్మార్వో హేమలత, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) బృంద సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సర్వే ప్రక్రియను పర్యవేక్షించారు.