శివాలయంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం
. . . భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం సదాశివనగర్, బతుకమ్మ : సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఉన్న శివాలయ ఆవరణలో ఆదివారం దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి ఆలయ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. వర్షాకాలంలో పాములు, విషపురుగులు, దోమల సంచారం పెరిగే అవకాశం ఉన్నందున భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ...