భీమేశ్వరాలయానికి వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన భీమేశ్వరాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు పటిష్టం చేయాలని,...