డ్రాపౌట్ లు ఎక్కువగా ఉన్న బడులపై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : డ్రాపౌట్ లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యా శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ సోమవారం మండల విద్యా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ 06 నుండి 12 వరకు నిర్వహించిన బడిబాట సందర్భంగా...