Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 5:21 pm Posted by : ramakrishna

ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

అడిషనల్ కలెక్టర్ అంకిత్

బతుకమ్మ మెండోరా: ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను బోర్డు పరీక్షలకు సిద్ధం చేస్తున్న తరుణంలో ప్రత్యేక ప్రణాళిక రూపందించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ లో గల సాంఘిక సాంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని వంటగదిని, కూరగాయలను, రైస్, స్టోర్ రూమ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో  విద్యా విషయాల గురించి మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠ్యపుస్తకాలలోని విషయాలను ఏ విధంగా చదవాలి ఈ విధంగా అవగాహన చేసుకోవాలని విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోదావరి, వైస్ ప్రిన్సిపాల్ అస్మా, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Special attention should be paid to each student