Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 11:17 am Posted by : ramakrishna

మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి : సుప్రీం కోర్టు

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై తీర్పు

డిల్లీ, బతుకమ్మ :  తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు విలువరించింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, మూడు నెలల మించకూడదని ఆదేశించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపిచ్చింది. ’ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్‘ అన్న సూత్రం వర్తించకూడదని పేర్కొంది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపై పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.


Speaker must take decision within three months: Supreme Court