టీఎల్ఎం కొనుగోళ్ళపై ఎస్పీడీ విచారణ
హాజరైన డీఈవో, ఏడి 22 మంది ఎస్ వోలు కూడా హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్,వరంగల్ జిల్లాలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం కొనుగోలు చేసిన టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ పై సర్వశిక్షా అభియాన్ లో విచారణ ప్రారంభమైంది. ప్రధానంగా రెండు జిల్లాల్లో 2025-26 విద్యా సంవత్సరాల్లో కేజీబీవీల కోసం టీఎల్ఎంలను కొనుగోలు చేశారు. సాధారణంగా 2.5 లక్షల పైచిలుకు కొనుగోళ్ళను టెండర్ల ద్వారా నిర్వహించడం ఆనవాయితీ. అయితే నిజామాబాద్, వరంగల్ జిల్లాలో సంబంధిత...