Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 8:23 pm Posted by : ramakrishna

కేజిబివిల ఎస్ఒలకు ఎస్ పిడి ఫైనల్ నోటిసులు

 

. . . ఏడాది కాలంగా టిఎల్ఎం నిధుల లొల్లి

 

. . . నేటికి కొలిక్కి రాని మిగులు బడ్జేట్ కిరికిరి

 

. . . వారం రోజుల గడువు… తరువాత చర్యలు

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

నిజామాబాద్ జిల్లాలో 21 మంది కేజీబివిల స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఒ) లకు సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పైనల్ నోటిసులు జారీ చేశారు. 2025-26 విద్యాసంవత్సరంలో జిల్లాలోని కేజిబివిలలో ఉన్న మిగులు బడ్జేట్ నిధులను టీచింగ్, లర్నింగ్ మెటిరియల్ (టిఎల్ఎం) కొనుగోలుకు ప్రైవేట్ ఎజేన్సీ ఖాతాలోకి డబ్బులు పంపిన విషయంలో వివరణ ఇవ్వాలని నోటిసులు జారీ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరం కు సంబందించి 21 కేజిబివిలలో రూ.60 వేల నుంచి 90 వేల వరకు మిగులు బడ్జేట్ నిధులు ఉండేవి. అయితే విద్యాశాఖాధికారులు ఎలాంటి టెండర్ లేకుండానే పాత మాదిరిగా (గతంలో కేజిబివిలకు టిఎల్ఎం) సరఫరాను టెండర్ లు లేకుండా కొనుగోలు చేసిన చరిత్ర ఉంది. దాని ప్రాతిపాదికగా అప్పటి జీసిఇఒ ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ ఎజెన్స్ ఖాతాలోకి మిగులు బడ్జేట్ నిధులను విడుదల చేశారు ఎస్ఓలు. అయితే 2025-26 సంవత్సరం కు సంబంధించిన టిచింగ్ లర్నింగ్ మెటిరియల్స్ ను తామే సరఫరా చేస్తామని రాష్ట్ర సర్వ శిక్ష్ అభియాన్ అధికారులు (ఎస్ పిడి) ప్రకటించారు. కానీ అప్పటికే నిజామాబాద్ జిల్లాలో కేజిబివిల నుంచి డబ్బులు ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహకుల ఖాతాల్లోకి మల్లించేశారు. ఈ విషయం అడిట్ టీం పట్టుకుంది. నిధుల రికవరి ఏమైందని ప్రశ్నించి విచారించిన ఏడాది కాలంగా ఈ వ్యవహరం నాన్చుడు దోరణి అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వ శిక్ష అభియాన్ ఎస్ పిడి నుంచి పైనల్ నోటిసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటిసులలో పేర్కొన్నారు. ఏడాది కాలంగా మిగులు బడ్జేట్ నిధుల వ్యవహరంలో బాధ్యులైన స్పెషల్ ఆఫిసర్ లతో పాటు జిల్లా అధికారులు సమాదానం ఇవ్వాలసిందే. నోటిసులకు ఇచ్చిన సంజాయిషీ అధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 

 

SPD final notices to KGBV SOs