Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 5:41 pm Posted by : ramakrishna

నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్

నిజామాబాద్, బతుకమ్మ : నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు  పి.సుధాకర్,పి.హనుమన్లు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.సుధాకర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు నూతన కలెక్టరేట్ లోనే ఉన్నందు వల్ల పాత కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాలు సంబంధిత అధికారులకు ఇవ్వడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రస్తుతం ధర్నాలు నిర్వహిస్తున్న ధర్నాచౌక్ రోడ్డుపైనే ధర్నాలు నిర్వహించాల్సి వస్తున్నదని రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్ వద్ద ధర్నాలు, నిరసనలు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని, ప్రజల,కార్మికుల అవసర నిమిత్తం కొత్త కలెక్టరేట్ సమీపంలో ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలని కోరడం జరిగిందన్నారు.