నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

కేసుల సంబంధించిన రికార్డుల పరిశీలన నిజాంసాగర్, బతుకమ్మ :  నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని నేరస్తుల వివరాలను ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసుల రికార్డులను  పరిశీలించారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సౌకర్యార్థం  ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేసి వాహనాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని , కొత్త  చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రాత్రివేళలో...