Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 6:42 pm Posted by : ramakrishna

రాజంపేట పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

 

రాజంపేట్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా రాజంపేట్ పోలీస్ స్టేషన్ ను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం పోలీస్ స్టేషన్ లో పోలీసు సిబ్బంది విధులు, రోల్‌కాల్, రికార్డుల నిర్వహణపై సమగ్ర సమీక్షించారు. నేరాల నియంత్రణ, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, మహిళలు,చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్‌ ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా సమర్థవంతమైన పోలీసింగ్‌ ధ్యేయంగా పని చేయాలని సూచించారు.  ఈ తనిఖీల్లో సిఐ జగడం నరేష్, ఎస్సైలు ఉన్నారు.