Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 9:39 pm Posted by : ramakrishna

దొంగలను పట్టుకున్న క్రైం బీట్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు

 

కామారెడ్డి, బతుకమ్మ:

 

కామారెడ్డి పట్టణంలో సోమవారం రాత్రి వివేకానంద కాలనీలో విధులు నిర్వహించిన క్రైమ్ బీట్ సిబ్బంది ప్రశాంత్ రెడ్డి, హోంగార్డు నర్సీంలు లను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినంధించారు. రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్న క్రైం బీట్ సిబ్బంది బైక్ పై వెలుతున్న ఇద్దరు అనుమానస్పద వ్యక్తులను ఆపి విచారించారు. అదే సమయంలో వారి వద్ద ఉన్న బ్యాగ్ లో ఫోన్ రింగ్ కాగా పోలీసులు దానిని విచారించగా ఓ మహిళ తన బ్యాగ్, సెల్ ఫోన్ చోరి విషయాన్ని తెలిపింది. బాధితురాలికి దైర్యం చెప్పిన సిబ్బంది వారిద్దరిని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించడంతో వారు చోరి విషయాన్ని ఒప్పుకున్నారు. రాత్రి వేళ అప్రమత్తంగా ఉండి మహిళ బ్యాగ్, సెల్ ఫోన్ చోరి చేసిన నిందితులను పట్టుకున్న ఇద్దరు క్రైం బీట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎఏస్పీ చైతన్య రెడ్డి తదితరులు అభినందించారు.

 

SP praises Crime Beat staff for catching thieves
SP praises Crime Beat staff for catching thieves

 

SP praises Crime Beat staff for catching thieves
SP praises Crime Beat staff for catching thieves