బీబీపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

బీబీపేట్, బతుకమ్మ : బీబీపేట్ పోలీస్ స్టేషన్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్రం సోమవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, సిబ్బంది బ్యారక్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించారు. ఇది సిబ్బందిలో నిబద్ధత, క్రమ శిక్షణ, బాధ్యతా భావాలను పెంపొందిచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సిబ్బంది క్రమ శిక్షణ, సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం,...