Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 6:34 pm Posted by : ramakrishna

వెనక్కి పంపిన సొయాబీన్.. ఆందోళనలో రైతన్నలు

అధికారులు రైతులకు హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు 

బతుకమ్మ, మద్నూర్:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా మద్నూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారులు పరిశీలించి సోయా పంట కొనుగోలు చేసి లారీలు ఎక్కించి పంపించారు. ఇక్కడి నుండి వెళ్లిన సోయా పంట ను అక్కడి అధికారులు పరిశీలించి వెనక్కి పంపియడంతో సోయా పంట 500 నుండి 600 బస్తాలు వెనక్కి పంపడంతో మద్నూర్ మార్కెట్ యార్డులో సోమవారం రైతులంతా ఆందోళన వ్యక్తం చేశారు. విండో కార్యదర్శిని ఎందుకు పంట వెనక్కి వచ్చిందని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే తాము సోయాలు అమ్మామని కొనుగోళ్ల అనంతరం రైతులకు ఇలా వాపసు చేయడం సరైన విధానం కాదంటూ విమర్శించారు. మద్నూర్ తాహసిల్దార్ ఎండి ముజిబ్, సొసైటీ కార్యదర్శి బాబురావు రైతులతో మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

Soybean sent back.. Farmers are worried