హైదరాబాద్‌ డివిజన్‌ లో దక్షిణ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తనిఖీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దక్షిణ మధ్య రైల్వే  జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం ముద్ఖేడ్ – సికింద్రాబాద్ సెక్షన్‌లో విస్తృతంగా తనిఖీ చేపట్టారు.  ఈ సందర్భంగా జీఎం తో  పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ సంతోష్ కుమార్ వర్మ, ఇతర సీనియర్ అధికారులూ ఉన్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముద్ఖేడ్ – సికింద్రాబాద్ సెక్షన్‌లో రియర్ విండో ఇన్స్పెక్షన్ చేసి, రైలు పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనలు, కీలక రైల్వే స్టేషన్ల భద్రతా అంశాలను సమీక్షించారు....