డబ్ల్యూటీసీ విజేతగా దక్షిణాఫ్రికా

లార్ఢ్స్, బతుకమ్మ : సుదీర్ఘ నిరీక్షణ తరువాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను దక్షిణాఫ్రికా సొంత చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 213/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ జట్టు మరో 3వికెట్లు కోల్పోయి టైటిల్ ను కైవసం చేసుకుంది. బవుమా(66), మార్ క్రమ్(136), అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3వికెట్లు పడగొట్టగా, కమిన్స్, హేజిల్ వుడ్ చెరో వికెట్ తీశారు.