Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2025, 8:34 pm Posted by : ramakrishna

హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సౌడ సురేష్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా  సౌడ సురేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ను ఎన్నుకున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో నామినేషన్ పద్దతిన నూతన అధ్యక్షులుగా సౌడ సురేష్  (హెచ్ డబ్ల్యూ ఓ ఆర్మూర్ బాయ్స్), ప్రధాన కార్యదర్శిగా చంద్ర శేఖర్ ((హెచ్ డబ్ల్యూ ఓ బోధన్ బాయ్స్) లను నిజామాబాద్ టీఎన్జీవో భవన్ లో గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ వసతి గృహ సంక్షేమాధికారుల జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్, కార్యదర్శి నేతికుంట శేఖర్ లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉండే హాస్టళ్ళలో నాణ్యమైన వసతిని కల్పించే బాధ్యత వార్డెన్ లపై ఉందన్నారు. విధి నిర్వహణను నిస్వార్థంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి అధికార యంత్రాంగం మన్ననల పొందాలని సూచించారు. ఈ సందర్భంగా హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ గా 30 సంవత్సరాలు పని చేసి పదోన్నతిపై మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న గంగాకిషన్, హెచ్ డబ్ల్యూవో జిల్లా అధ్యక్షునిగా పని చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మచ్చేంధర్ లను అభినందించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు.

Souda Suresh elected as President of Hostel Welfare Officers Association