తండ్రి జన్మదినం సందర్బంగా తనయుడి అన్నదానం
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దివంగత వంగ రామేశ్వర్ రెడ్డి 80వ జన్మదినం సందర్భంగా తన కుమారుడు వంగ గిరిధర్ రెడ్డి గంభీరావుపేట మండల కేంద్రంలోని మా వృద్ధ అనాధ ఆశ్రమంలో వృద్ధులందరికీ శుక్రవారం అన్నదానం నిర్వహించారు. ప్రతి జన్మదిన సందర్భంగా అనాధ ఆశ్రమాలలో వృద్ధులకు అన్నదానం నిర్వహిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో దొంతి అమరేందర్ రెడ్డి, నేవూరి సురేందర్ రెడ్డి, సత్తిరెడ్డి, నూకల శ్రీను, భోగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.