ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోనియా జన్మదిన వేడుక

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు సతీశ్ పటేల్, సొసైటీ చైర్మన్ శివానంద పటేల్, అనిల్, కమ్మవారి రాజు, దిలీప్ పటేల్, బొంపల్లి రాజంపేట, మాజీ మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ సాయిగౌడ్, జుక్కల్ మాజీ సర్పంచ్ దేమే అంజయ్య సేట్, సురేశ్, గంగునాయక్, లక్ష్మణ్, పల్లెవార్ ప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.