కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, నాయకులు కారంగుల అశోక్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షుడు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు పంపర్ లక్ష్మణ్, కౌన్సిలర్ కన్నయ్య, మాజీ కౌన్సిలర్ బొట్టు మోహన్, బుజ్జి పంతులు, శీను, గంగాధర్, వైద్య కిషన్ రావు కార్యకర్తలు పాల్గొన్నారు.