Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 2:19 pm Posted by : ramakrishna

మెండోరా తాసిల్దార్ కార్యాలయం ముట్టడించిన సోన్ పేట గ్రామస్ధులు

బతుకమ్మ, మెండోరా:

మెండోరా తహసీల్ధార్  కార్యాలయంను సోన్ పేట గ్రామస్థులు ముట్టడించారు. సోన్ పేట  గ్రామ అభివృద్ధికి చెందిన  329 సర్వే నెంబర్ గల  (  గ్రామ కంఠం భూమి) ఓక ఎకరం భూమి  మరోక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు చేస్తూ మెండోరా మండలం సోన్ పేట గ్రామస్తులు సోమవారం తాసిల్ ల్దార్ కార్యాలయం ముట్టడించారు. తమ గ్రామానికి చెందిన భూమిని తమకు చెందాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకోవడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని అందోళన విరమింప చేశారు.