- కలెక్టరేట్ కు గడ్డిమందుతో తరలివచ్చిన బాధితురాలు
- ఆత్మహత్యాయత్నంను అడ్డుకున్న పోలీసులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ కలెక్టరేట్ కు ఓ మహిళ గడ్డిమందుతో రావడం కలకలం రేపింది. తన భూ సమస్యను అధికారులు పరిష్కంచడం లేదని సోమవారం ఐడిఓసీకి వచ్చిన మహిళ పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలంపాడ్ కు చెందిన జయమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండెకరాలలో వ్యవసాయం చేసుకుంటు జీవిస్తుంది. ఆమేకు తెలియకుండా వారి చిన్నకొడుకు అర ఎకరం భూమిని విక్రయించాడు. ఈ విషయంపై స్థానిక తహసీల్ధార్ కు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కరించడం లేదని వాపోయింది. తన వద్ద అన్ని పత్రాలు ఉన్న జరిగిన క్రయ విక్రయాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతు కలెక్టరేట్ కు గడ్డిమందుతో తరలివచ్చింది. ఫిర్యాదు చేయకుండానే పురుగుల మందు తీసుకొని తాగే ప్రయత్నంలోనే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం పై అధికారులకు నివేధించగా చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.