గొడ్డలితో కొడుకుపై దాడి
. . . తండ్రి అరెస్ట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : కొడుకు వేధింపులు తాళలేక నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కపేట గ్రామానికి చెందిన గుడిపేట రాఘవులు అలియాస్ రాఘవరెడ్డికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు గుడిపేట రాజేందర్ ఎలాంటి పని చేయకుండా తండ్రిని వేధించడంతో...