Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 5:55 pm Posted by : ramakrishna

నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ ఉద్యోగానికి సోమిరెడ్డి రాజీనామా ?

 

. . . అబ్కారి కానిస్టెబుళ్ల బదిలీ వ్యవహరంలో కమీషనర్ తో విబేధం

 

. . . కమీషనర్ వాఖ్యలతో మనస్థాపంతో అస్వస్థత పాలైన సోమిరెడ్డి

 

. . . ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు అధికారుల గ్రూప్ లో పోస్టు

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ ఇంచార్జీ డిప్యూటి కమీషనర్ గా పనిచేస్తున్న సోమిరెడ్డి శనివారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ గేజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ లో తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు పోస్టు పెట్టారు. అబ్కారీ శాఖలో ఇటివల 1912 మంది హెడ్ కానిస్టెబుళ్లు, కానిస్టెబుళ్లను బదిలీ చేశారు. రెండు సంవత్సరాల పధవి కాలం ముగిసిన వారితో పాటు జోనల్ పోస్టులలో సినియర్ లకు ప్రయార్టి ఇవ్వాలని సోమిరెడ్డి ప్రతిపాధించినట్లు తెలిసింది. ఎనిమిది సంవత్సరాల తరువాత జరుగుతున్న కానిస్టెబుళ్ల బదిలీల విషయంలో ఎక్సైజ్ శాఖ కమీషనర్ హరి కిరణ్ సోమిరెడ్డి ప్రతిపాధనను విబేధించడంతో పాటు కిందిస్థాయి సిబ్బంది ముందు ఇడియట్.. పండవెట్టి తొక్కుతా అంటూ చేసిన వాఖ్యలు అయనను తీవ్ర మనస్థాపానికి గురి చేసినట్టు తెలిసింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు మానసికంగా బాధ కలిగించాయంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన సోమిరెడ్డి, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేనంటూ రాజీనామా చేస్తూ ప్రభుత్వానికి రాజీనామా లేఖ రాసారు. ఎక్సైజ్ శాఖలో డిప్యూటి కమీషనర్ హోదా కలిగిన అధికారి ఉద్యోగానికి రాజీనామా వ్యవహరం కలకలం రేపింది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిజామాబాద్ అబ్కారి శాఖ డిసీ సోమిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా పై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. అయితే ఎక్సైజ్ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ అధికారి చేవూరి హరి కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శనివారం మాజీ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో ఆంద్ర అధికారుల పెత్తనం పెరిగిందని మండిపడ్డారు. నిజామాబాద్  ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమీషనర్ గా పనిచేస్తున్న సోమిరెడ్డి గత కోంతకాలంగా ఇంచార్జీ డిసీగా పనిచేస్తున్నారు. గత ఎడాధి డిసెంబర్ లో సోమిరెడ్డికి డిసీగా పదోన్నతి పోందిన పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఇంచార్జీ డిసీగానే పనిచేస్తున్నారు.

 

Somi Reddy resigns from the post of Nizamabad Excise Deputy Commissioner?