- ఎక్సైజ్ శాఖ షాంపిళ్ల సేకరణ పై అనుమానాలు
- ఎక్సైజ్ శాఖ బాస్ నే బురిడీ కొట్టించారా..?
- కోతకు రాని ఈత చెట్ల నుంచి కల్లు సేకరణ జరుగుతుందటా
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కల్తీ (కృత్రిమ) కల్లు షాంపిళ్ల సేకరణ పై ఆరోపణలు
నిజామాబాద్, బతుకమ్మ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో గత రెండు రోజులుగా కూకట్ పల్లిలో కల్తీకల్లు సేవించిన ఘటనలో ఆరుగురు మృతి చెంది.. సుమారు 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించి పలువురు కల్లు తయారీదారుల (మూస్తేదారుల) పై కేసు నమోదు చేశారు. కూకట్ పల్లి కల్తీకల్లు ఘటనపై రామారావు అనే వ్యక్తి ఆన్‌లైన్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ విషాద సంఘటనపై అన్ని ప్రధాన వార్తపత్రికలు ప్రచురించాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవిన్యూ (ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్99874 విభాగానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు 20 లోపు దాఖలు చేయాలని ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయడం, కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో ఎక్సైజ్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
తెలంగాణలో అత్యధికంగా కృత్రిమ కల్లు (కల్తీకల్లు ) తయారీ కుటిర పరిశ్రమ నుంచి చిన్న పరిశ్రమగా ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈత, తాటి (రేషన్ ) లేకున్న నిత్యం లక్షల లీటర్ల కల్లు తయారీ అవుతుంది. మే మాసంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్తీకల్లు బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. అందుకు గాను కల్లు డిపోల (నిర్వాహకుల) పై కేసులు నమోదు చేశారు పోలీసులు. అబ్కారీ శాఖ షాంపిళ్లను సేకరించింది. కాని అక్కడ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. షాంపిళ్లు సేకరించిన కృత్రిమ రసాయినాలతో (నిషేదిత మత్తు పదార్థాల) వాడకంపై ఎలాంటి రిపోర్టులు రాలేదు. కాని షరా మాములుగా కల్లు తయారీ జరుగుతుంది. కల్తీ కల్లు ఏరులై పారుతోంది. రెండు రోజుల క్రితం హైద్రాబాద్ లో కల్తీ కల్లు ఘటనలో ఆరుగురు చనిపోవడంతో అబ్కారీ శాఖ మళ్లీ షాంపిళ్ల సేకరణ చేపట్టింది. అందుకు గాను అన్ని కల్లు డిపోలలో ఎస్ హెచ్ఓ లు మొదలు అసిస్టెంట్ కమిషనర్ లు, సూపరింటెండెంట్ లు, డీసీపీ వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో లక్ష లీటర్ల కల్లు ఉత్పత్తి(కృత్రిమ కల్లు ) తయారు ఇందూర్ కేంద్రం. మూడు డిపోలలో ఈ కల్లు తయారు అవుతుండగా వాటిని బట్టీలలో విక్రయిస్తున్నారు. గురువారం నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులు కల్లు డిపోలలో షాంపిళ్ల సేకరణ జరిపారు. అంతకుముందు సంబంధిత కల్లుడిపోకు కల్లు సరఫరా జరిగే (ఈత వనాలు) పరిశీలించారు. అక్కడ అసలు కోతకు రాని చెట్లను పరిశీలించిన అధికారులు అక్కడి నుంచి కల్లు సరఫరా అంటు సర్టిఫై చేసినట్లు తెలిసింది. అది చాలదన్నట్టు రోజుకు లక్ష లీటర్ల కల్లు తయారీ పైపుల ద్వార ప్యాకేట్లలో ఉత్పత్తి అయ్యే చోట (డిపో) లో లక్షల లీటర్ల కల్లు కలిగిన పీపాలు నుంచి షాంపిళ్ల సేకరణ చేశారా, లేక నిర్వహకులు ఇచ్చిన కల్లు సిసాలను షాంపిళ్లుగా తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు అక్కడ ప్యాకేట్లలో ఉన్న కల్లును షాంపిళ్లుగా తీసుకున్నారా అనే సంశయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల నగరంలో రేషన్ (ఈత చెట్లు) లేవని ఒక డిపోకు సంబంధించిన కల్లుబట్టిలను మూసిన అధికారులు లక్ష లీటర్ల కల్లు ఉత్పత్తి అయ్యే చెట్లను ఎలా సర్టిఫై చేశారు అనే విమర్శలు వస్తున్నాయి. కూకట్ పల్లి ఘటన నేపథ్యంలో కల్లు డిపోల నిర్వాహకులు మొత్తం ఎక్సైజ్ అధికారులను బురిడీ కొట్టించారా అనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ కల్లు ఘటనను సీరియస్ గా తీసుకోకుండా కంటితుడుపు చర్యలకు అబ్కారీ శాఖ సిద్ధమైందనే వాదనలు కుడా లేకపోలేదు.