Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 8:29 pm Posted by : ramakrishna

వరద కాలువలో ఒకరి గల్లంతు

నీటి విడుదల నిలిపివేత

 

బాల్కొండ, బతుకమ్మ : బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి ఒకరు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోయి నందువల్ల నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.