Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 7:27 am Posted by : ramakrishna

నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు 

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. లండన్ పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ విమానశ్రయంలో మీడిమా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు.  ఇటీవల తనపై, పార్టీపై  కొందరు ఆరోఫణలు చేశారు.  ఎందుకో చేశారో.. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో.. తనపై  చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.  తనపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యనించారు.    కేసీఆర్ గత పదేళ్లుగా నిర్మించిన ఒక్కొ వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు.  రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగుజారుడు రాజకీయాలు మంచివి కావన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసు అన్నారు.  ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత తన పై ఉందన్నారు.

Some people are spreading misinformation about me and the party.