Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 9:27 pm Posted by : ramakrishna

కొందరు గుడి పవిత్రను దెబ్బతీస్తున్నారు

బతుకమ్మ భిక్కనూర్: భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ సిద్ధరామేశ్వరాలయం పవిత్రతను కొందరు  దెబ్బతీస్తున్నారని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొట్టి గిని శంకర్ మాట్లాడుతూ గత 20 రోజుల కింద హుండీ  లెక్కింపు సమయంలో చేతివాటం చూపించిన వ్యక్తిపై  విచారణ చేపట్టి టెంపుల్ ఈవో శ్రీధర్  సస్పెండ్ చేశారు. కానీ టెంపుల్ కు సంబంధించిన రూములను వేరే వ్యక్తి తన పేరుపై  రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆ విషయాన్ని పక్కన పెట్టి తనకొక్క న్యాయం మందికొక్కనయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఆ రూముల వివరాలు తెలియజేయపరచాలని దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డప్పు రవి, సాజిత్, కర్రోల రాజు ,జంగం సుధాకర్ ,గోసు రమేష్, సుధాకర్ తదితరులు ఉన్నారు.