Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2025, 9:28 pm Posted by : ramakrishna

ప్రజా పాలనతో సమస్యల పరిష్కారం

  • పథకాలలో పేరు రాలేదని అధైర్య పడొద్దు
  • అర్హత కలిగిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఆర్మూర్ కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనతో ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండలం దేగాం గ్రామం లో బుధవారం ప్రజా పాలన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాను చదివి వినిపిస్తారన్నారు. జాబితా ప్రకారం అర్హులైన లబ్ధిదారులను గ్రామసభ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ గృహాలు మంజురవుతాయన్నారు. రేషన్ కార్డులురానీ వారు ఆందోళన చెందవద్దని ఈ సభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఆలూర్ తహసీల్దార్ రమేష్ లబ్ధిదారుల జాబితాను సభలో ప్రజలందరి ముందు చదివి వినిపించారు. రేషన్ కార్డులు రాని వారి వద్ద నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ రమేష్, ఏవో రాంబాబు, కార్యదర్శి శ్రీనివాస్, ఆలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ముక్కెర విజయ్,మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ ముత్యం రెడ్డి,మాజి ఎంపిటిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్,ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్ల రెడ్డి,ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు చిన్న రెడ్డి, అంకపూర్ మాజి ఎంపిటిసి సభ్యులు మార చిన్న గంగారెడ్డి,పిప్రి జీవన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Solving problems with public governance