Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 5:45 pm Posted by : ramakrishna

తాగు నీటి సమస్యకు పరిష్కారం

 

. . . ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బోర్ ప్రారంభం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో పరిష్కారం లభించింది. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరతను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కొత్త బోర్‌వెల్ మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బోర్‌వెల్ తవ్వకాలను వేగంగా పూర్తి చేయగా, మంగళవారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ బోర్‌వెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాటట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసిన బోర్‌వెల్ నుంచి గండి మాసానిపల్లి గ్రామంలోని వాటర్ ట్యాంక్‌కు నీటిని పంపింగ్ చేసి, 5వ వార్డు ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. దీంతో వార్డులో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. జగ్జీవన్, కౌన్సిలర్లు చంద్రయ్య, శంకర్, విద్యాసాగర్, శ్రీధర్ సిద్ధి, గఫార్, దశరథ్, శ్యాం, కో-ఆప్షన్ సభ్యుడు వసీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.